Tuesday, December 17, 2013

ఎప్పుడైతే భద్రాచలానికి బ్రిడ్జ్ పడిందో అప్పటినుంచి లాంచీల ప్రాధాన్యత తగ్గిపోయింది.

లక్ష్మీనగరలో గల బ్రిటీషు వారి సమాధుల గురించి గతం లో ఓ పోస్ట్ ద్వారా తెలియబరిచాను.ఇలాంటి చారిత్రక ఆనవాళ్ళు కొన్నిటినైన మనం ఇల పదిలపరిచితే గతకాలం లోని అవశేషాలని ముందు తరాలవారికి ..ఈ ప్రాంత చరిత్ర పట్ల ఆసక్తి గలవారికి ఓ రికార్డ్ గా ఉపయోగపడుతుంది.ఈ సమాధులకి దగ్గరగా అంటే సుమారు నాలుగైదు ఫర్లాంగుల దూరం లో వున్న కెయిన్ పెట కి ఇటీవల వెళ్ళడం జరిగింది.ఓ పద్దెన్మిది ఏళ్ళ క్రితం చూసినప్పుడున్న కొన్ని నిర్మాణాలు మచ్చుకి కూడా లేకుండా శిధిలమై పోయాయి.అవన్నీ కూడా బ్రిటీష్ వారు తమ ఆవాసాలుగా నిర్మించుకున్నవే.దుమ్ముగూడెం ఇంకా లక్ష్మీ నగరం జంటగ్రామాలు.ఇప్పుడంటే లక్షిమీనగరం బాగా అభివృద్ది చెందింది గాని గత కాలపు వైభవం అంతా దుమ్ముగూడెం దేనని చెప్పాలి. 1986 నుండి వచ్చిన గోదావరి వరదలవల్ల దుమ్ముగూడెం క్షీణించింది.మండల కార్యాలయాలన్ని ఆ దాపునే ఉన్న లక్ష్మీనగరానికి తరలిపోయాయి.ఒక్క హైస్కూల్,పోస్టాఫీసు ,కాలేజి లాంటివి ఇక్కడ మిగిలాయి.అయితే ఇప్పుడు నిర్మితమవుతున్న హైడల్ ప్రాజెక్ట్ వల్ల మళ్ళీ దుమ్ముగూడెం కి ప్రాభవం వచ్చేలాగున్నది.1865 ప్రాంతం లో కెప్టెన్ గ్లాస్ ఫోర్డ్ అనే బ్రిటీష్ అధికారి ఎగువ గోదావరి జిల్లా మీద ఇచ్చిన రిపోర్ట్ లో ఈ డివిజన్ గురించి బాగా వివరం గా రాశాడు.దాని ప్రకారం భద్రాచలం కంటే దుమ్ముగూడెం గ్రామమే పెద్ద వాణిజ్య,వ్యవసాయ కేంద్రం గా వుండేది.జనాభా కూడా ఎక్కువ గా ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చారు. దుమ్ముగూడెం నుంచి రాజమండ్రి కి లాంచీ ల ద్వారా ట్రాన్స్ పోర్ట్ జరిగేది.ఎప్పుడైతే భద్రాచలానికి బ్రిడ్జ్ పడిందో అప్పటినుంచి లాంచీల ప్రాధాన్యత తగ్గిపోయింది.సరే..అదలా వుంటే ఈ కెయిన్ పేట అనేది బ్రిటీష్ వాళ్ళు దుమ్ముగుడెం ని ఆనుకుని నిర్మించినట్టిది.ఇది వారి కొరకు నిర్మించుకున్న సెటిల్మెంట్ గా చెప్పవచ్చు.ఇక్కడ నావిగేషన్ కేంద్రం...వర్క్ షాప్...ఒక చర్చ్...వారి ఇళ్ళు  వుండేవి. ఊరితో సంబందం లేకుండా ప్రత్యేకం గా ఉంటుందిది.
ఇటీవల నేను ఈ ప్రదేశాన్ని సందర్శించినపుడు మిగిలి వున్న ఒకే ఒక్క అప్పటి భవనాన్ని చూడడం జరిగింది.మిగతావన్నీ కాలగర్భం లో కలసిపోయినాయి.ఇది కూడా శిధిలావస్థకి చేరువలో ఉన్నది.కనుక దానికి సంబందించిన కొన్ని ఫోటోలు తీసి ఇక్కడ ఇస్తున్నాను.  ఈ భవనం ని సున్నం,ఇసుక లాంటివి వాడి నిర్మించారు.కాని ఇప్పటి దిట్టం గానే వున్నది.అయితే పై కప్పులు అక్కడక్కడ వీక్ అయినాయి.లోపలికి ప్రవేశించగానే విశాలమైన గదులు,ధారళంగా వెలుతురు గాలి వచ్చే విధం గా ఉన్నాయి.పైన కూడ ఇంకో అంతస్తు ఉన్నది.ఆ పైన టాయ్లెట్ కూడా ఉన్నది.పై నుంచి చూస్తే ఏరియల్ వ్యూ చాలాదూరం కనిపిస్తుంది.చుట్టుప్రక్కల దట్టమైన వృక్షాలు ..నిర్మానుష్యం గా ఉన్నది.చాలా చల్లగా అనిపించింది.ఒక రెండు కుటుంబాలు ఇక్కడ ఉన్నట్టు తోచింది.ప్రస్తుతం చర్చ్ కి సంబందించిన పేద పిల్లల వసతి గృహం గా వాడుతున్నారు ఈ నిర్మాణాన్ని.  

2 comments:

  1. భద్రాచలప్రాంత చరిత్రపైమీ కృషి అద్బుతం! అభినందనీయం.ఎవరూచూదని కోణం.విలువైన సమాచారం

    ReplyDelete

Thanks for your visit and comment.