Tuesday, November 26, 2013

హిందీ హీరో రణ్ బీర్ కపూర్,ప్రముఖ తెలుగు హీరో దగ్గుబాటి రాణా లాంటి వారు హాజరయ్యారని ,వారి మాటల్ని దగ్గరనుండి వినడం ఆనందకరం గా వున్నదని చెప్పారు.
నవంబర్ 14 నుండి 20 వ తేదీ వరకు హైదరాబాద్ లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం జరిగిన విషయం అందరకీ తెలిసిందే.ఖమ్మం జిల్లా నుండి మొత్తం ఈసారి ఆరుగురు విద్యార్ధులు ఫాల్గొనగా భద్రాచలం మండలం లో గల నెల్లిపాక గ్రామం లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఇద్దరు బాలలు దానికి హాజరవడం విశేషం.9 వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థులు చిన్నం రాజా,బానోత్ కళ్యాణ్ తమ అనుభూతులను "మన భద్రాద్రి" బ్లాగ్ కి తెలిపారు.

The park అనే ఫైవ్ స్టార్ హోటల్ లో తమకి బస కల్పించారని,తమతో బాటు ఖమ్మం జిల్లా కి  చెందిన మిగతా బాలలు కూడా వారి రూం లోనే ఉన్నారని తెలిపారు.హోటల్ లో వసతి సౌకర్యాలు బాగున్నాయని అన్నారు.లలితకళాతోరణం లో జరిగిన ప్రారంభ సభ లో ముఖ్యమంత్రివర్యులు,ఇతర మంత్రులు ఇంకా ప్రముఖ హిందీ హీరో రణ్ బీర్ కపూర్,ప్రముఖ తెలుగు హీరో దగ్గుబాటి రాణా లాంటి వారు హాజరయ్యారని ,వారి మాటల్ని దగ్గరనుండి వినడం ఆనందకరం గా వున్నదని చెప్పారు.

మొత్తం భాగ్య నగరం లో ఉన్న ఆరు రోజుల్లో రోజుకి మూడు సినిమాలకి తక్కువ కాకుండా 25 సినిమాల దాకా చూపించారని,అవన్నీ కూడా ప్రసాద్ ఐమాక్స్ లో చూడటం అద్భుతం గా ఉందని తెలిపారు.ఏ సినిమా ప్రదర్శన రోజున ఆ సినిమాకి సంబందించిన దర్శకులు ,నటులు హాజరయ్యవారని ..కొంతమంది తో ఫోటోలు దిగడం ,మాట్లాడటం చేసేవారని వెల్లడించారు.

తాము చూసిన సినిమాల్లో హిందీ,ఇంగ్లీష్,చైనీస్ ..ఇంకా ఇతర భాషలవి కూడా ఉన్నాయట.మిణుగురు అనే బాలల తెలుగు చిత్రాన్ని చూశారట.
ప్రతిరోజు తమను హోటల్ నుండి ఐమాక్స్ దాకా బస్సులో తీసుకువచ్చేవారని...అక్కడే టిఫిన్స్,లంచ్ చేయించి సినిమాలు చూసిన తరవాత తమని హోటల్ దగ్గర దింపేవారని అన్నారు.

ముగింపు సమావేశానికి గవర్నర్,హీరో పవన్ కళ్యాన్,సినిమాటోగ్రఫీ మంత్రి డి.కె.అరుణ వచ్చారని,ఈ బాలల చలన చిత్రోత్సవం లో ఫాల్గొనడం ఆనందకరంగా ఉందని తెలిపారు ఆ విద్యార్థులు.తమను ఎంతగానో ప్రొత్సహించిన ప్రధానోపాధ్యాయులు మాధవరావు గారికి ఇంకా ఇతర ఉపాధ్యాయ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.  Click Here  

No comments:

Post a Comment

Thanks for your visit and comment.