Thursday, November 7, 2013

భద్రాద్రి కి విచ్చేసిన కోదండరాముడు


భద్రాచలం తెలంగాణ లో అంతర్భాగమని అలా ఉండటం లోనే ఈ ప్రాంత జనులకు అన్ని విధాలా న్యాయం జరుగుతుందని ఈ ప్రాంతాన్ని విడదీసే యోచనను సమ్మతించే సమస్యే లేదని తెలంగాణా రాష్ట్ర జె ఏ సి కన్వీనర్ ప్రొ.కోదండరాం అన్నారు.నిన్న ఆయన భద్రాద్రి రాముడిని దర్శించుకున్న అనంతరం  ఇక్కడ స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల లో జరుగుతున్న వృత్యంతర శిక్షణలో ఫాల్గొన్న వివిధ మండలాల కి చెందిన ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.తాను చిన్నతనం లో ఇక్కడనే పుట్టువెంట్రుకలు తీయుంచుకున్న సంగతిని ఈ సంధర్భంగా గుర్తు చేశారు.

ఖమ్మం జిల్లా ఉద్యోగ సంఘాల జె ఏ సి కన్వీనర్ కూరపాటి రంగరాజు,రెవెన్యూ శాఖ కి చెందిన జిల్లా నాయకులు నడింపల్లి వెంకటపతి రాజు,స్థానిక ఉద్యోగ సంఘ నేతలు చల్లగుళ్ళ నాగేశ్వర రావు,ధనికొండ శ్రీనివాసరావు,రేగలగడ్డ ముత్తయ్య ఇంకా తదితరులు మాట్లాడారు.Click here


No comments:

Post a Comment

Thanks for your visit and comment.